Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 11 నుంచి ఫస్టియర్ తరగతులు
- షెడ్యూల్ విడుదల
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో 2022-23 విద్యాసంవత్సరానికి సంబంధించిన ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం ప్రవేశాల షెడ్యూల్ను ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ గురువారం విడుదల చేశారు. శుక్రవారం నుంచి ఇంటర్ ప్రథమ సంవత్సరం ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపారు. రాష్ట్రంలోని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రయివేటు, మోడల్ స్కూళ్లు, కేజీబీవీలు, గురుకుల జూనియర్ కళాశాలల్లో మొదటి విడత ప్రవేశాల కోసం శుక్రవారం నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. మొదటివిడత ప్రవేశాల ప్రక్రియ వచ్చేనెల 17 వరకు నిర్వహిస్తామని తెలిపారు. ఈనెల 11 నుంచి ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు తరగతులు ప్రారంభమవుతాయని వివరించారు. రెండో విడత ప్రవేశాల ప్రక్రియ తేదీలను తర్వాత ప్రకటిస్తామని పేర్కొన్నారు. ఇంటర్నెట్ మార్కుల మెమోతో ప్రవేశం పొందొచ్చని సూచించారు. కాలేజీలో చేరిన తర్వాత ఎస్ఎస్సీ ఒరిజినల్ మెమో, టీసీ ఇవ్వాలని కోరారు. ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు ఆరు శాతం, బీసీలకు 29 శాతం, వికలాంగులకు మూడు శాతం, ఎన్సీసీ, క్రీడాకారులకు ఐదు శాతం, ఎక్స్ సర్వీస్మెన్, రక్షణ శాఖలో పనిచేసిన వారి పిల్లలకు మూడు శాతం చొప్పున ప్రవేశాల్లో రిజర్వేషన్లుంటాయని తెలిపారు.
అన్ని కేటగిరీల్లోనూ అమ్మాయిలకు 33 శాతం రిజర్వేషన్లు వర్తిస్తాయని స్పష్టం చేశారు. ఇంటర్ ప్రవేశాలకు ఆధార్ నెంబర్ తప్పనిసరి అని తెలిపారు. అనుబంధ గుర్తింపు ఉన్న జూనియర్ కాలేజీల్లోనే ప్రవేశం పొందాలని సూచించారు. ఆ కాలేజీల జాబితాను tsbie.telangana.gov.in ýñ<‘ bie.telangana.gov.in వెబ్సైట్లో పొందుపరుస్తామని వివరించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన కాలేజీ యాజమాన్యాలపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.