Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్యూపీ ఉత్పత్తుల నిషేధంపై కఠినంగా వ్యవహరిస్తాం : మంత్రి అల్లోల
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ప్రజల భాగస్వామ్యంతోనే సంపూర్ణ ప్లాస్టిక్ నిషేధం సాధ్యమవుతుందని రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. పర్యావరణానికి హాని కలిగించే సింగిల్ యూజ్ ప్లాస్టిక్(ఎస్యూపీ)ఉత్పత్తులపై నిషేధాన్ని కఠినంగా అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ అమలు చేయనున్నట్టు తెలిపారు. శుక్రవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఒకసారి వినియోగించి వదిలేస్తే ప్లాస్టిక్ ఉత్పత్తులపై నిషేధాన్ని కఠినంగా అమలు చేసేందుకు రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి తగిన చర్యలు తీసుకుంటున్నదని చెప్పారు. హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ సరఫరా, ముడిసరుకులను, ప్లాస్టిక్ డిమాండ్‌ను తగ్గించడానికి తగిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రత్యామ్నాయాలను ప్రోత్సహించడం, ప్రజలను చైతన్య పరచడంతో పాటు, పట్టణ స్థానిక సంస్థలు, జిల్లా పరిపా లన యంత్రాంగానికి అవగాహన కల్పిస్తామని తెలిపారు. సమగ్ర కార్యా చరణ ప్రణాళికలో భాగంగా పీసీబీ బహుముఖ విధానాన్ని అవలంబిం చనుందని వివరించారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధాన్ని సమర్ధ వంతంగా అమలు చేసేందుకు, ప్రత్యామ్నాయ వస్తువులను ప్రోత్సహిం చేందుకు కంపోస్టబుల్ ప్లాస్టిక్ వస్తువుల తయారీకి కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి వన్ టైం సర్టిఫికెట్లను జారీ చేస్తున్నదని చెప్పారు.