Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆన్లైన్లో దరఖాస్తు గడువు 15
- నోటిఫికేషన్ విడుదల
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్/బాసర
రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ) బాసర త్రిపుల్‌ఐటీలో 2022-23 విద్యాసంవత్సరంలో ఆరేండ్ల సమీకృత బీటెక్ కోర్సులో ప్రవేశాల ప్రక్రియ శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు ఆర్జీయూకేటీ ఉపకులపతి (వీసీ) రాహుల్ బొజ్జా, డైరెక్టర్ సతీష్‌కుమార్ గురువారం నోటిఫికేషన్ విడుదల చేశారు. దరఖాస్తులను టీఎస్ఆన్లైన్లో మాత్రమే చేసుకోవాలని సూచించారు. ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ శుక్రవారం నుంచి ప్రారంభమవుతుందని వివరించారు. దరఖాస్తుల సమర్పణకు తుదిగడువు ఈనెల 15 వరకు ఉందని తెలిపారు. పోస్టు ద్వారా దరఖాస్తుల సమర్పణకు తుది గడువు ఈనెల 19 వరకు ఉందని పేర్కొన్నారు. ప్రొవిజినల్ జాబితాను ఈనెల 30న ప్రకటిస్తామని తెలిపారు. 85 శాతం సీట్లు తెలంగాణ స్థానిక విద్యార్థులకు, 15 శాతం సీట్లు అన్ రిజర్వుడు (ఏపీ, తెలంగాణ) విద్యార్థులకు మెరిట్ ఆధారంగా కేటాయిస్తామని వివరించారు. పదో తరగతి గ్రేడ్ పాయింట్ యావరేజ్ (జీపీఏ), ప్రతి సబ్జెక్టులోనూ అభ్యర్థి పొందిన గ్రేడ్ ప్రతిభల ఆధారంగా, రూల్ ఆఫ్ రిజర్వేషన్‌ను అనుసరించి ప్రవేశాలను చేపడతామని పేర్కొన్నారు. గురుకులాలయేతర, ప్రభుత్వ పాఠశాలల నుంచి వచ్చిన దరఖాస్తులకు జీపీఏకు అదనంగా 0.4 డిప్రైవేషన్ స్కోరును కలుపుతామని వివరించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రేతర విద్యార్థులకు, గల్ఫ్ దేశాలల్లో పనిచేస్తున్న భారతీయుల పిల్లలకు ఎన్ఆర్ఐ విద్యార్థులకు సూపర్‌న్యూమరరీ సీట్లలో ప్రవేశాలకు అర్హులని స్పష్టం చేశారు. ఇతర వివరాలకు www.rgukt.ac.in, www.admissions.rgukt.ac.in వెబ్సైట్లను సంప్రదించాలని సూచించారు.