Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ - వీణవంక
కరీంనగర్ జిల్లా వీణవంక మండలంలోని మల్లారెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఓ బాలికపై గురువారం లైంగికదాడి జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. వరంగల్ జిల్లాకు చెందిన వరికొప్పుల శేఖర్ మల్లారెడ్డిపల్లి గ్రామంలో జేసీబీ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో ఓ బాలికతో పరిచయం ఏర్పరచుకుని, నమ్మించి లైంగికదాడికి పాల్పడ్డాడు. విషయం ఎవరికైనా చెబితే చంపుతానని బాలికను బెదిరించి పారిపోయాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ శేఖర్ తెలిపారు.