Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆరోపణ
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డికి రాజకీయాలు తెలీవని కాంగ్రెస్ ఎమ్మెల్యే టి జగ్గారెడ్డి విమర్శించారు. ఆయన ఓ మెడికల్ మాఫియా అని ఆరోపించారు. అధికారం ఎక్కడ ఉంటే అక్కడికి పోతారని విమర్శించారు. గురువారం గాంధీభవన్‌లో ఆయన విలేకర్లతో మాట్లాడారు. బీజేపీ విలువలు లేని రాజకీయం చేస్తున్నదని విమర్శించారు. ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైన ప్రభు త్వాలను కూల్చేస్తున్నదని చెప్పారు. ప్రజలు అధికారానికి దూరం పెడితే, దొడ్డిదారిన అధికారంలోకి వస్తున్నదని విమర్శించారు. శివసేనలో చీలికలు తెచ్చి మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని పడగొట్టిందని చెప్పారు. బిల్లా రంగా సినిమాలో చిరంజీవి, మోహన్‌బాబు కొట్లాడుకున్నట్టే....మోడీ, కేసీఆర్ కొట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. వారిద్దరి నాటకాలను జనానికి వివరిస్తామని చెప్పారు.