Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కిసాన్ కాంగ్రెస్ చైర్మెన్ అన్వేష్‌రెడ్డి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ధరణి పోర్టల్‌తో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఈనెల 6న ఇందిరాపార్కు వద్ద రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని కిసార్ కాంగ్రెస్ చైర్మెన్ సుంకేట అన్వేష్‌రెడ్డి చెప్పారు. గురువారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ఆయన విలేకర్లతో మాట్లాడారు. భూమి హక్కు పత్రాల కోసం గత ఐదేండ్లుగా రైతులు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారని చెప్పారు. ధరణి భూ సమస్యలను పెంచుతున్నది తప్ప తగ్గించింది లేదన్నారు. నిజమైన హక్కుదారుడికి పట్టాపుస్తకాలు రావడం లేదనీ, దీంతో ఎమ్మార్వోలను కూడా తగులబెట్టే దుస్థితి ఏర్పడిందన్నారు. 30 లక్షల ఎకరాలకు పాస్‌పుస్తకాలు అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నిజమైన హక్కుదారులను కూడా నిషేధిత జాబితాలో పెట్టారని విమర్శించారు. రైతుల దగ్గర భూములను లాక్కొని రియల్ఎస్టేట్ చేస్తున్నారని ఆరోపించారు. భూహక్కులకు సంబంధించిన విషయంలో రైతులకు అండగా ఉంటామనీ, అందులో భాగంగానే రచ్చ బండ కార్యక్రమం నిర్వహిస్తున్నామని చెప్పారు.