Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 12 రోజుల్లో ఫలితాలు : కన్వీనర్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో పాలిటెక్నిక్, డిప్లొమా కోర్సుల్లో 2022-23 విద్యాసంవత్సరంలో ప్రవేశాలకు నిర్వహించిన పాలిటెక్నిక్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (పాలిసెట్) రాతపరీక్షకు 91.62 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఈ మేరకు రాష్ట్ర సాంకేతిక విద్యా శిక్షణా మండలి (ఎస్బీటీఈటీ) కార్యదర్శి, పాలిసెట్ కన్వీనర్ డాక్టర్ సి శ్రీనాథ్ గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. పాలిసెట్‌కు 52,689 మంది అమ్మాయిలు దరఖాస్తు చేస్తే, 48,031 (92.02 శాతం) మంది పరీక్ష రాశారని వివరించారు. 61,290 మంది అబ్బాయిలు దరఖాస్తు చేయగా, 56,401 (91.16 శాతం) మంది వచ్చారని తెలిపారు. మొత్తం 1,13,979 మంది అభ్యర్థులు దరఖాస్తు చేస్తే, 1,04,432 (91.62 శాతం) మంది పరీక్ష రాశారని వివరించారు. పాలిసెట్ రాతపరీక్షను రాష్ట్రవ్యాప్తంగా 365 పరీక్షా కేంద్రాల్లో ప్రశాంతంగా నిర్వహించామని తెలిపారు. 12 రోజుల్లో ఫలితాలు విడుదల చేస్తామని ప్రకటించారు.