Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సర్కారుకు మెట్టుసాయి ప్రశ్న
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
తెలంగాణలో రెండు మత్స్య కళాశాలలు, పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామన్న హామీ ఏమైందని టీపీసీసీ ఫిషర్మెన్ చైర్మెన్ మెట్టు సాయికుమార్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మత్స్యకారులకు వరాల జల్లు అని చెప్పి, వారి జేబులకు చిల్లులు పెట్టారని విమర్శించారు. గురువారం హైదరాబాద్లోని గాంధీభవన్లో ఆయన విలేకర్లతో మాట్లాడారు. చేపపిల్లల పంపిణీలో భారీ అవినీతి జరిగినా...సీఎం కేసీఆర్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో 20 వేల చెరువులున్నప్పటికీ మత్స్యపరిశ్రమ ఎందుకు ఏర్పాటు చేయలేదన్నారు. నేరుగా కాంట్రాక్టర్లకు చేప పిల్లలు ఎందుకు ఇస్తున్నారనీ, అధికారుల కనుసన్నల్లోనే నాణ్యత లేని చేప పిల్లలు పంపిణీ జరుగుతున్నదని విమర్శించారు. నాణ్యతలేని చేప పిల్లలతో మత్స్యకారుల కుటుంబాలు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.20 శాతంమేర కమీషన్లు అందుతుండటంతోనే ఇతర రాష్ట్రాలకు చెందిన వారికి కాంట్రాక్టులు ఇస్తున్నారని విమర్శించారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కన్నుసన్నల్లోనే అవినీతి వ్యవహరం జరుగుతున్నదన్నారు.