Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ఫలితాలు శుక్రవారం విడుదల కానున్నాయి. ఈ మేరకు ఎస్సీఈఆర్టీ డైరెక్టర్, టెట్ కన్వీనర్ ఎం రాధారెడ్డి గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. శుక్రవారం ఉదయం 11.30 గంటలకు టెట్ పేపర్-1, పేపర్-2 ఫలితాలు https://tstet.cgg.gov.in వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయని వివరించారు. బుధవారం టెట్ తుది కీ విడుదల చేసిన సంగతి తెలిసిందే. గతనెల 12న జరిగిన టెట్ రాతపరీక్ష పేపర్-1కు 3,51,468 మంది దరఖాస్తు చేస్తే 3,18,506 (90.62 శాతం) మంది, పేపర్-2కు 2,77,884 మంది దరఖాస్తు చేయగా, 2,51,070 (90.35 శాతం) మంది అభ్యర్థులు హాజరయ్యారు.