Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
జాతీయ వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందర రాజన్ వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు గురువారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. డాక్టర్లు నిస్వార్థ్యంగా మానవతాదృక్పథంతో సేవలందిస్తున్నారని కొనియాడారు. కోవిడ్-19 మహమ్మారి సమయంలో వారందించిన సేవలను గుర్తుచేశారు. మన ప్రాణాలను రక్షిస్తున్న డాక్టర్లను ప్రజలు రక్షించుకోవాలని సూచించారు.
హరీశ్ రావు శుభాకాంక్షలు
డాక్టర్లు కనిపించే దేవుళ్లంటూ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి టి.హరీశ్ రావు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. డాక్టర్లకు థ్యాంక్స్ అని చెబితే సరిపోదనీ, వారి త్యాగాలను గౌరవించాలని సూచించారు. ప్రభుత్వాస్పత్రుల్లోని వైద్యులు... తమకు అందుబాటులో ఉన్న వనరులతో రోగులకు ఉత్తమ వైద్యమందిస్తున్నారని అభినందించారు.