Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యుత్ ఉద్యోగ సంఘాలకు పే రివిజన్ కమిటీ లేఖలు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
విద్యుత్ ఉద్యోగుల వేతన సవరణ (2022) కోసం ఆయా సంస్థల్లోని ఉద్యోగ సంఘాలు ప్రతిపాదనలు ఇవ్వాలని పే రివిజన్ సంప్రదింపుల కమిటీ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఆయా సంఘాలకు కమిటీ కన్వీనర్ లేఖలు రాసారు. పే రివిజన్ కమిటీకి టీఎస్‌ట్రాన్స్‌కో జేఎమ్డీ (ఫైనాన్స్, కమర్షియల్ అండ్ హెచ్ఆర్డీ) సీ శ్రీనివాసరావు చైర్మెన్‌గా వ్యవహరిస్తుండగా, మరో ఐదుగురు సభ్యులు దీనిలో ఉన్నారు. టీఎస్ ట్రాన్స్‌కో, జెన్కో, ఉత్తర, దక్షిణ ప్రాంతాల విద్యుత్ పంపిణీ సంస్థల్లో పనిచేస్తున్న ప్రధాన యూనియన్లు, అసోసియేషన్లు తమ ప్రతిపాదనలను జులై 15వ తేదీలోపు తమకు అందించాలని కోరారు. వాటిలో కేటగిరీల వారీగా వేతన సవరణ, అలవెన్సులు, పెన్షన్లు తదితర అంశాలను పేర్కొనాలని విజ్ఞప్తి చేశారు.