Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
ఒక వ్యక్తి నుంచి రూ. 30వేలు లంచం తీసుకుంటుండగా నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి తహసీల్దార్‌తో పాటు మరో రెవెన్యూ ఇన్స్పెక్టర్(ఆర్ఐ)ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏసీబీ డైరెక్టర్ జనరల్ అంజనీ కుమార్ గురువారం తెలిపిన వివరాల ప్రకారం.. ఇందల్వాయి గ్రామానికి చెందిన సతీశ్ అనే వ్యక్తి తన ట్రాక్టర్‌ను విడుదల చేయాలంటూ ఇందల్వాయి తహసీల్దార్ రమేశ్ కుమార్, ఆర్ఐ దస్రత్ అలీ ఖాన్ లను కోరాడు. ఎలాంటి పొరపాటు లేకున్నా.. తన ట్రాక్టర్ సీజ్ చేయడం అన్యాయమని మొర పెట్టుకున్నాడు. అయితే, అదుపులోకి తీసుకున్న ట్రాక్టర్‌ను విడుదల చేయడానికి రూ. 30 వేలను తహసీల్దార్, ఆర్ఐ లు డిమాండ్ చేశారు. ఈ డబ్బులను తీసుకుంటుండగా రమేశ్ కుమార్, దస్రత్ అలీ ఖాన్‌లను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. లంచం సొమ్మును స్వాధీన పర్చుకున్నారు. అరెస్టు చేసిన ఇద్దరు నిందితులను ఏసీబీ కోర్టులో హాజరుపరచి జైలుకు తరలించినట్టు అధికారులు తెలిపారు.