Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ, బీసీఏ, బీబీఎం, బీఎస్‌డబ్ల్యూ కోర్సుల్లో 2022-23 విద్యాసంవత్సరానికి ప్రవేశాల కోసం డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) రిజిస్ట్రేషన్ల ప్రక్రియ శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. ఉస్మానియా విశ్వవిద్యాలయం (ఓయూ), కాకతీయ విశ్వవిద్యాలయం (కేయూ), తెలంగాణ విశ్వవిద్యాలయం (టీయూ), మహా త్మాగాంధీ విశ్వవిద్యాలయం (ఎంజీయూ), పాలమూరు విశ్వవిద్యాలయం (పీయూ), శాతవాహన విశ్వవిద్యాలయం (ఎస్‌యూ), తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం (టీడబ్ల్యూయూ) పరిధిలో ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రయివేటు డిగ్రీ కాలేజీల్లో దోస్త్ ద్వారా డిగ్రీ ప్రవేశాలు జరగనున్నాయి. శుక్రవారం నుంచి డిగ్రీ ప్రవేశాల కోసం ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణులైన విద్యార్థులు వచ్చేనెల 30 వరకు రిజిస్ట్రే షన్ చేసుకునేందుకు గడువున్నది. రిజిస్ట్రేషన్ ఫీజు రూ.200 చెల్లించాల్సి ఉంటుంది. ఈనెల ఆరు నుంచి 30 వరకు వెబ్ఆప్షన్లను నమోదు చేయాలి. ప్రత్యేక కేటగిరీ విద్యార్థుల ధ్రువపత్రాల పరిశీలన వచ్చేనెల 28,29 తేదీల్లో చేపడతారు. ఆగస్టు ఆరున తొలివిడత సీట్ల కేటాయింపు ఉంటుంది. డిగ్రీ ప్రవేశాల కోసం రాష్ట్రవ్యాప్తంగా 40 హెల్ప్‌లైన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. విద్యార్థులు పూర్తి వివరాలకు https://dost.cgg.gov.in వెబ్ సైట్ ను సంప్రదించాలి.