Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తాను త్వరలో బీజేపీలో చేరుతున్నట్టు మాజీ ఎంపీ కొండావిశ్వేశ్వర్‌రెడ్డి ప్రకటించారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి ఈ విషయం చెప్పగా 'ఆల్‌ది బెస్ట్' అంటూ ఆశ్వీరదిం చారని వ్యాఖ్యానించారు. కోదండరామ్, చెరుకు సుధాకర్ లాంటి తెలంగాణ ఉద్యమకారులతోనూ చర్చించాకే ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. గురువారం హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లోని తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడా రు. ప్రస్తుతం తానొక్కడినే శని లేదా ఆదివారాల్లో బీజేపీలో చేరుతానని చెప్పారు. రాజగోపాల్‌రెడ్డి చేరుతాడా? లేదా? అన్నది ఆయన ఇష్టమన్నారు. తెలంగాణలో నియంతృత్వ పాలన పోవాలంటే అది బీజేపీతోనే సాధ్యమని చెప్పారు. కాంగ్రెస్‌లో మంచి నేతలున్నప్పటికీ ప్రజల్లో ఆ పార్టీ నమ్మకాన్ని కోల్పోయిందన్నారు.