Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్ర పండుగైన బోనాలు ప్రారంభమైన సందర్భంగా తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శుభాకాంక్షలు తెలిపారు. గోల్కొండ జగదాంబికా అమ్మవారికి బోనం సమర్పణతో గురువారం నుంచి రాష్ట్రంలో బోనాల ఉత్సవాలు ప్రారంభమయ్యాయని తెలిపారు. ప్రతి ఏటా ఆషాఢం, శ్రావణ మాసాల్లో రాష్ట్రవ్యాప్తంగా జరుపుకునే బోనాల పండుగను రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నామని చెప్పారు. తెలంగాణ సబ్బండ వర్గాల సాంప్రదాయాలకు రాష్ట్ర ప్రభుత్వం సముచిత గౌరవాన్నిస్తున్నదని సీఎం తెలిపారు. తెలంగాణ ప్రత్యేక సంస్కతిని చాటే బోనాల పండుగ తెలంగాణ జీవన వైవిధ్యానికీ, పర్యావరణ, ప్రకృతి ఆరాధనకు ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు. రాష్ట్ర ప్రజలకు సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలు అందించాలని అమ్మవారిని సీఎం కేసీఆర్ ప్రార్థించారు.