Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
హైదరాబాద్‌లోని తెల్లాపూర్, కొల్లూరులో జీహెచ్ఆర్ కాలిస్ట్రో భవన సముదాయ గృహా అమ్మకాల ను ప్రారం భించినట్టు జీహెచ్ఆర్ ఇన్ఫ్రా సీఈఓ మాడ్గుల కార్తీష్రెడ్డి, మేనేజింగ్ పార్టనర్ వీ శ్యాం సుందర్‌రెడ్డి తెలిపారు. గురు వారం నాడిక్కడ జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. పర్యావరణ అనుకూలంగా, స్మార్ట్ సాంకేతికతల మేళవింపుగా వీటిని నిర్మిస్తున్నామన్నారు. 'రెరా' అనుమతితో 8.3 ఎకరాల విస్తీర్ణంలో నాలుగు హై రైజ్ టవర్లతో, బిల్డింగ్ ఇన్ఫర్మేషన్ మోడలింగ్ (బీఐఎం) టెక్నాలజీ ద్వారా 3డీ మోడల్స్‌తో,11 వింగ్స్‌గా 1,190 స్మార్ట్హౌమ్ల నిర్మాణం ప్రారంభిస్తున్నట్టు తెలిపారు. వీటిలో రెండు, మూడు, నాలుగు బెడ్రూంలు ఉంటాయన్నారు. ప్రాథమిక ధరను చదరపు గజానికి రూ.4,799గా నిర్ణయించామన్నారు. ఈ నిర్మాణాలన్నీ 2025 నాటికి పూర్తవుతాయనీ, తూర్పు ఫేసింగ్, ఫ్లోర్లు, ఇతర అంశాలను బట్టి ధరల్లో స్వల్ప మార్పులు (ఎక్కువగా) ఉంటాయన్నారు. నాలుగు టవర్లనూ టాటా ప్రాజెక్ట్స్ ద్వారా నిర్మిస్తున్నామనీ, ఈ మేరకు ఆ సంస్థతో నిర్మాణ ఒప్పందం చేసుకున్నామన్నారు. భద్రత, సౌకర్యాల విషయలో ఎక్కడా రాజీ పడబోమని స్పష్టం చేశారు. రిటైల్ ఔట్లెట్లు, పాఠశాలలు, హాస్పిటల్స్, ఎంటర్టైన్మెంట్ జోన్స్ ఉన్నాయనీ, ఔటర్ రింగ్‌రోడ్ ద్వారా కనెక్టివిటీ ఉంటుందని వివరించారు. ఫ్లాట్లు రూ. 56 లక్షల ప్రారంభ ధరతో లభిస్తాయని చెప్పారు. ఈవీ స్టేషన్లు, రిఫ్లెక్సాలజీ పాత్, మూడు స్విమ్మింగ్ పూల్స్, మల్టీ పర్పస్ పార్టీ హాల్, లాన్స్, యాంఫీ థియేటర్, మినీ గోల్ఫ్ కోర్స్, క్రికెట్ నెట్ ప్రాక్టీస్, హాఫ్ బాస్కెట్ బాల్ కోర్టు, ఇండోర్ గేమ్స్, కిడ్స్ ప్లే , పెట్ పార్క్, క్లబ్ హౌస్, లైబ్రరీ, జిమ్నాషియం, బార్బిక్యు స్పేస్ వంటి అనేక సౌకర్యాలు ఈ నిర్మాణాల్లో ఉంటాయని తెలిపారు.