Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సమస్యలు పరిష్కారించాలని డిమాండ్
నవతెలంగాణ - విలేకరులు
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్స్ అందించాలని భారత విద్యార్ధి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపట్టారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని రాయపోల్, చర్లపటేల్గూడ జెడ్పీ హైస్కూల్, ఇబ్రహీంపట్నం బాలుర ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులతో నిరసన తెలిపారు. కార్యక్రమంలోఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు పి జగన్ పాల్గొన్నారు. వికారాబాద్ జిల్లాకేంద్రంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి సతీశ్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఆదిలాబాద్ జిల్లాకేంద్రంలోని బ్రహ్మాణ్వాడ ప్రభుత్వ పాఠశాల ఎదుట పాఠశాలల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని విద్యార్థులతో కలిసి ధర్నా చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలకేంద్రంలోని ప్రభుత్వ పాఠశాల ఎదుట ప్లకార్డులతో విద్యార్థులు నిరసన తెలిపారు. ప్రభత్వ పాఠశాలలో ఉన్నసమస్యలు పరిష్కరించాలని నినాదాలు చేశారు.