Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీజేపీ తెలంగాణ ఇన్చార్జి తరుణ్ చుగ్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తెలంగాణలో ప్రభుత్వాన్ని నడుపుతున్నది కేసీఆర్ కాదు..కవిత, కేటీఆర్, హరీశ్‌రావు అని బీజేపీ తెలంగాణ ఇన్చార్జి తరుణ్‌చుగ్ విమర్శించారు. హైదరా బాద్‌లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల నేపథ్యంలో శుక్రవారం నోవాటెల్ లో మీడియా ప్రాంగణంలో ఆయన మాట్లాడారు. సమావేశాల ప్రాంగంణలో తెల ంగాణ చరిత్రను తెలిపే ఫొటో ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేశామన్నారు. ఆడవారిని నగంగా బతుకమ్మ ఆడించిన నిజాం కాలం నాటి దుర్మార్గపు గుర్తులను ప్రదర్శన లో పెట్టామన్నారు. శనివారం ఉదయం 8:30 గంటల నుంచి పదాధికారుల సమావేశం జరుగుతుందని చెప్పారు. సాయంత్రం నాలుగు గంటలకు జాతీయ కార్యవర్గ సమావేశాలు ప్రారంభమవుతాయనీ, ప్రధాని మోడీ ప్రసంగిస్తారని తెలి పారు. ఇప్పటికే 119 నియోజవర్గాల్లో 119 మంది జాతీయ నేతలు రెండురోజుల పాటు పర్యటించి పలు సమావేశాల్లో పాల్గొన్నారన్నారు. నగరంలో నివసిస్తున్న ఆయా రాష్ట్రాల ప్రజలతో ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహిస్తున్నామన్నారు. సమావేశాలకు సంబంధించిన ప్రతి అంశాన్నీ మీడియాకు వివరిస్తామని చెప్పారు. రాష్ట్రంలో ఏం అభివృద్ధి చెందిందని ప్రశ్నించారు. నిజాంకాలంలో జరిగిన తరహా లో మహిళలపై లైంగికదాడులు, సజీవ దహనాలు చోటుచేసుకుంటున్నాయనీ, దీనిని బట్టే రాష్ట్రంలో శాంతిభద్రతలు ఏ విధంగా ఉన్నాయో అర్ధమవుతున్నదని వి మర్శించారు. 35వేల బూతుల నుంచి తమ పార్టీ కార్యకర్తలు విజయ సంకల్ప్ తీసుకునేందుకు పెరేడ్ గ్రౌండ్ సభకు వస్తున్నారని తెలిపారు. కేసీఆర్ పోకడలు నచ్చక తెలంగాణ ఉద్యమకారులంతా బీజేపీలో చేరుతున్నారన్నారు. 520 రోజుల తర్వాత తెలంగాణలో కుటుంబ,అవినీతి పాలనకు విముక్తి లభిస్తుందని చెప్పారు.