Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ట్యూషన్ ఫీజు చెల్లింపునకు చివరి తేదీ 31
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం డిగ్రీ, పీజీ కోర్సుల్లో 2022-23 విద్యాసంవత్సరంలో ప్రవేశాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు వర్సిటీ ఇన్ఛార్జి రిజిస్ట్రార్ ఎ వెంకట్రాంనరసింహ్మారెడ్డి శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. డిగ్రీలో బీఏ, బీకాం, బీఎస్సీ, పీజీలో ఎంఏ, ఎంకాం, ఎంఎస్సీ, ఎంబీఏతోపాటు బీఎల్ఐఎస్సీ, ఎంఎల్ఐఎస్సీ, పీజీ డిప్లొమా వంటి పలు సర్టిఫికెట్ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేశామని తెలిపారు. ఆయా కోర్సుల్లో చేరడానికి విద్యార్హతలు, ఫీజు, కోర్సులు వంటి వివరాలను www.braouonline.in, www. braou. ac.in వెబ్సైట్లను సంప్రదించాలని సూచించారు. 2021-22 విద్యాసంవత్సరంలో మొదటి ఏడాదిలో ప్రవేశం పొందిన విద్యార్థులు, రెండో ఏడాది ట్యూషన్ ఫీజును, అంతకుముందు చేరిన విద్యార్థులు సకాలంలో ఫీజు చెల్లించలేక పోయిన వారూ ఈనెల 31లోపు ట్యూషన్ పీజును ఆన్లైన్లో చెల్లించాలని కోరారు.