Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఏఎఫ్ఆర్సీ షెడ్యూల్ జారీ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ఇంజినీరింగ్ సహా వృత్తి విద్యా కాలేజీల్లోని కోర్సుల ఫీజులను ఖరారు చేసేందుకు రంగం సిద్ధమైంది. ఈనెల ఏడు నుంచి కాలేజీ యాజమాన్యాలతో సంప్రదింపులు జరపాలని తెలంగాణ అడ్మిషన అండ్ పీజు రెగ్యులేటరీ కమిటీ (టీఏఎఫ్ఆర్సీ) నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ను జారీ చేసింది. 145 కాలేజీ యాజమాన్యాలకు సమాచారం అందించింది. ఏ రోజు ఏ యాజ మాన్యం హాజరు కావాలో షెడ్యూల్ను ప్రకటించింది. దాని ప్రకారం ప్రతి రోజూ 15 కాలేజీల యాజమాన్యాలను ఆహ్వానించింది. ఈనెల 20 వరకు సంప్రదింపుల ప్రక్రియను చేపట్టనుంది. ఆ తర్వాత ఫీజుల ఖరారుపై ప్రతిపాదనలు తయారు చేసి ప్రభుత్వానికి పంపించనుంది. ఇప్పటికే బీఈడీ, లా, బీపీఈడీ కోర్సుల ఫీజులను ఖరారు చేసిన విషయం తెలిసిందే. ఆ ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వానికి పంపించినట్టు సమాచారం.