Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు వచ్చేనెల ఒకటి నుంచి పదో తేదీ వరకు జరగనున్నాయి. ఈ మేరకు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు ఎ కృష్ణారావు శుక్రవారం షెడ్యూల్ను విడుదల చేశారు. పదో తరగతి పరీక్షలు ఆగస్టు ఒకటి నుంచి పదో తేదీ వరకు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు నిర్వహిస్తామని తెలిపారు. ఆగస్టు ఒకటిన ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ (గ్రూప్-ఏ), ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్-1 (కాంపొజిట్ కోర్సు), ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్-2 (కాంపొజిట్ కోర్సు), రెండున సెకండ్ లాంగ్వేజ్, మూడున థర్డ్ లాంగ్వేజ్, నాలుగున మ్యాథమెటిక్స్, ఐదున జనరల్ సైన్స్ (ఫిజికల్ సైన్స్, బయలాజికల్ సైన్స్), ఆరున సోషల్ స్టడీస్, ఎనిమిదిన ఓఎస్ఎస్సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్-1 (సంస్కృతం, అరబిక్), పదో తేదీన ఓఎస్ఎస్సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్-2 (సంస్కృతం, అరబిక్) పరీక్షలుంటాయని వివరించారు.