Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జల్పల్లి మునిసిపల్ కమిషనర్ అక్రమాస్థులు మూడు కోట్లకు పైనే..!: అవినీతి నిరోధక శాఖ దాడుల్లో వెల్లడి
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
ఏసీబీ వలకు మరో అవినీతి జలగ చిక్కింది. రంగారెడ్డి జిల్లా జల్పల్లి మునిసిపల్ కమిషనర్ వెంకట్రావు అక్రమ ఆస్థులు రూ. 3 కోట్లకు పైనేనని ఏసీబీ జరిపిన ఆకస్మిక దాడుల్లో వెల్లడైంది. ఏసీబీ డైరెక్టర్ జనరల్ అంజనీ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. జల్పల్లి మునిసిపల్ కమిషనర్ వెంకట్ రావు ఆదాయానికి మించి ఆస్థులను కలిగి ఉన్నట్టుగా ఏసీబీకి విశ్వసనీయ సమాచారమందింది. దీంతో జల్పల్లిలోని మునిసిపల్ కమిషనర్ కార్యా లయంతో పాటు రంగారెడ్డి జిల్లా బాలనగర్ మండలం వెంకటాపురం లోని కమిషనర్ నివాసంపై ఏసీబీ అధికారులు ఏక కాలంలో దాడులు జరిపారు. ఈ దాడుల్లో బంగారం, నగదుతో పాటు ఇతర ఆస్థులు కలిపి రూ. 3, 03, 52,000 అక్రమాస్థులను వెంకట్రావు కలిగి ఉన్నట్టు ఏసీబీ తేల్చింది. అంతే గాక, మరికొన్ని స్థిర, చరాస్థులకు సంబంధించిన పత్రాలను కూడా ఏసీబీ స్వాధీనం చేసుకున్నది. ఆదాయానికి మించి ఆస్థులు కలిగి ఉన్నాడనే ఆరోపణ లపై నిందితుడు వెంకట్రావును అరెస్టు చేసి ఏసీబీ కేసుల ప్రత్యేక కోర్టులో హాజరు పరిచారు. చంచల్గూడ జైలుకు ఏసీబీ అధికారులు తరలించారు.