Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
పారిశ్రామిక పురోగతిలో భాగంగా విశేష ప్రతిభ కనబర్చిన 19 సంస్థలకు తెలంగాణ వాణిజ్య, పారిశ్రామిక మండళ్ల సమాఖ్య (ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండిస్టీ-ఎఫ్టీసీపీఐ) తరఫున ఎక్స్‌లెన్సీ అవార్డుల్ని ప్రకటించారు. ఈనెల 4వ తేదీ హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీలో జరిగే కార్యక్రమంలో రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ, పురపాలక శాఖల మంత్రి కే తారకరామారావు చేతుల మీదుగా ఈ అవార్డులను అందించనున్నట్టు ఎఫ్‌టీసీసీఐ అధ్యక్షులు కే భాస్కరరెడ్డి తెలిపారు. శుక్రవారంనాడిక్కడ జరిగిన విలేకరుల సమావేశంలో ఆయనతో పాటు అవార్డుల కమిటీ చైర్మెన్ గౌర శ్రీనివాస్ ఇతర సభ్యులు పాల్గొన్నారు. అవార్డుల ఎంపిక కోసం మొత్తం 150 నామినేషన్లు వచ్చాయనీ, 22 అంశాలను ప్రాతిపదికగా చేసుకొని, 19 కంపెనీలు, వ్యక్తులను ఎక్స్‌లెన్సీ అవార్డుల కోసం ఎంపిక చేసినట్టు వివరించారు. ఎగుమతులు, మార్కెటింగ్, నూతన ఆవిష్కరణలు, పరిశోధన-అభివృద్ధి సాంకేతికత, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఉద్యోగుల సంక్షేమం, ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్, నూతన సంప్రదాయ ఇంధన వనరులు, పర్యాటక ప్రోత్సాహం సహా పలు అంశాలను పరిగణనలోకి తీసుకున్నామన్నారు.
అవార్డు గ్రహీతలు వీరే...
ఎఫ్‌టీసీసీఐ ఎక్స్‌లెన్సీ అవార్డులకు ఎంపికైన సంస్థల వివరాలను గౌర శ్రీనివాస్ వెల్లడించారు. హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, మెట్రోకెమ్ ఏపీఐ ప్రయివేట్ లిమిటెడ్, శాంఅగ్రిటెక్ లిమిటెడ్, బిఫాచ్ 4ఎక్స్ ప్రయివేట్ లిమిటెడ్, రవి ఫుడ్స్, సర్వోత్తమ్ కేర్ లిమిటెడ్, ఎన్సీఎల్ ఇండిస్టీస్, స్కై షేడ్ డేలైట్స్ ప్రయివేట్ లిమిటెడ్, కన్వర్జ్ బయోటెక్, క్లిక్2క్లినిక్ హెల్త్‌కేర్ ఇండియా, మైత్రీ డ్రగ్స్, సహస్రా క్రాప్ సైన్స్, అనంత్ టెక్నాలజీస్, వివిద్మైండ్స్ టెక్నాలజీస్, సురేంద్ర అసోసియేట్స్, సైబర్ సెక్యూరిటీ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్సీ, నవభారత్ వెంచర్స్ లిమిటెడ్ అవార్డులకు ఎంపికయ్యాయి. వ్యక్తిగత ఎక్స్‌లెన్స్ అవార్డులు సైంటిస్ట్ డాక్టర్ ఇబ్రహీం గణేష్, మహిళా పారిశ్రామికవేత్త దీపా దాదు ఎంపికయ్యారు. వీరందరికీ ఈనెల 4న జరిగే సమావేశంలో మంత్రి కేటీఆర్ అవార్డులు అందచేస్తారు, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి జయేష్‌రంజన్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. సమావేశంలో ఎఫ్‌టీసీసీఐ సీఈఓ ఖ్యాతినారవానే, ఉపాధ్యక్షులు మీలా జయదేవ్ తదితరులు పాల్గొన్నారు.