Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కుటుంబానికి చెందిన జమునా హేచరీస్ ప్రయివేట్ లిమిటెడ్ వివాదం మరోసారి హైకోర్టుకు చేరింది. మెదక్ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేట్ గ్రామంలో హేచరీస్ ఉన్న భూమి ప్రభుత్వానికి చెందిందని పేర్కొంటూ మండల తహసీల్దార్ ఇచ్చిన నోటీసులకు సంబంధించి ఈటల భార్య జమున, ఆయన కుమారుడు నితిన్‌రెడ్డి దాఖలు చేసిన రిట్లపై శుక్రవారం జస్టిస్ ఎం.సుధీర్ కుమార్ ఎదుట వాదనలు పూర్తయ్యాయి. దీంతో తీర్పును తర్వాత వెలువరిస్తామని హైకోర్టు ప్రకటించింది. గతంలో న్యాయ స్థానం ఇచ్చిన ఆదేశాలకు వ్యతిరేకంగా తమ వాదనలను వ్యక్తిగతంగా వినాలంటూ అధికారులు కోరుతున్నారు. తాము కొన్న భూమికి రిజి స్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. జాయింట్ కలెక్టర్ ప్రొసీడింగ్స్ తర్వాత రికార్డుల్లో సత్యనారాయణరావు అనే రైతు పేరును ఎక్కిం చారు. అతని నుంచి నితిన్‌రెడ్డి మూడెకరాలను కొన్నారు. ఇప్పుడు అ భూమి విషయంలో అధికారులు ఉద్దేశ్యపూర్వకంగా నోటీసులు ఇస్తున్నారు. వాటిని కొట్టేయాలని కోరుతూ పిటిషనర్ తరపు లాయర్ వాదించారు. అది అసైన్డ్ భూమి. ప్రభుత్వానిదే ల్యాండ్. అసైన్డ్ భూమిని ఎవరు కొనుగోలు చేసినా చెల్లదు. సర్వే 130 నెంబర్లోని మొత్తం భూమి ప్రభుత్వానిదే. అసైన్డ్ భూమిని కొన్న పిటిషనర్లకు ఏవిధమైన హక్కు లూ ఉండవు. రిట్లను కొట్టేయాలి.. అని ప్రభుత్వం తరపు లాయర్ వాదించారు. అనంతరం హైకోర్టు తీర్పును రిజర్వులో పెట్టింది.
హైకోర్టు అడ్వొకేట్స్ అసోసియేషన్ ఎన్నికలు
తెలంగాణ రాష్ట్ర హైకోర్టు అడ్వొకేట్స్ అసోసియేషన్ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. అధ్యక్షుడిగా వి.రఘునాథ్, ఉపాధ్యక్షుడిగా పి.కృష్ణారెడ్డి, కార్యదర్శులుగా జి.మాల్లారెడ్డి, జె.నరేందర్, సంయుక్త కార్యదర్శిగా ఎస్.సుమన్, కోశాధికారిగా ఎం.నాగరాజు గెలుపొందారు. క్రీడల విభాగ కార్యదర్శిగా రాజు, కార్యనిర్వహక సభ్యులుగా.కిశోర్‌రావు, కె.కృష్ణ కిశోర్, బి.కవిత, టి.కన్యాకుమారి, ఎన్.అనిరుధ్, ఈ.రవిందర్‌రెడ్డి, ఆర్పీ రాజు, పి. రాధిక విజయం సాధించారు. రఘునాథ్‌కు భారీ మెజార్టీ లభించింది. గురువారం జరిగిన ఎన్నికల ఫలితాలు అర్ధరాత్రి దాటిన తర్వాత వెలువడ్డాయి.