Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - కాసిపేట
మంచిర్యాల జిల్లా కాసిపేట బాలుర గురుకుల పాఠశాలలో కరోనా కలకలం రేపింది. సుమారు 18మంది విద్యార్థులకు కరోనా ప్రబలడంతో ఆందోళన నెలకొంది. కాసిపేట మండల గురుకుల పాఠశాల బెల్లంపల్లి పట్టణంలో కొనసాగుతోంది. విద్యార్థులు అనారోగ్యంతో ఉండటంతో శుక్రవారం పరీక్షలు చేయించారు. వారికి కరోనాగా తేలింది. దీంతో పాఠశాల సిబ్బంది వెంటనే తల్లిదండ్రులకు సమాచారం అందించారు. వారు పాఠశాలకు వచ్చి పిల్లలను ఇండ్లకు తీసుకెళ్లారు. ఇంత మందికి కరోనా రావడంతో తల్లిదండ్రులు భయాందోళన చెందుతున్నారు. పాఠశాలకు సెలవులు ప్రకటించాలని కోరుతున్నారు.