Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి గంగుల కమలాకర్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
యాసంగి ధాన్యం కొనుగోళ్లు పూర్తయినట్టు రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. 50.67 లక్షల మెట్రిక్ టన్నుల సేకరించి రూ.9,680 కోట్లు రైతులకు చెల్లించినట్టు వెల్లడించారు. యాసంగిలో 9,916 కోట్ల విలువగల 50.67 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని దాదాపు తొమ్మిది లక్షల 52 వేల మంది రైతుల నుంచి సేకరించామని పేర్కొన్నారు. నిధుల మొత్తాన్ని సొంతంగా రాష్ట్ర ప్రభుత్వమే సమకూర్చుకుందని తెలిపారు. రాష్ట్రావిర్భావం నుంచి రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు చేస్తూ అన్ని రాష్ట్రాల కన్నా ముందు వరసలో తెలంగాణ నిలిచిందని చెప్పారు.
డాక్టర్లకు శుభాకాంక్షలు
జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు డాక్టర్లకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. వైద్యుల సేవలకు త్యాగాలతో కూడుకున్నవనీ, కరోనా సమయంలో వారు తమ ప్రాణాలను ఫణంగా పెట్టారని కొనియాడారు.
డాక్టర్లకు జోగినపల్లి ధన్యవాదాలు
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటిన డాక్టర్లందరికీ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ధన్యవాదాలు తెలిపారు. జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా డాక్టర్లకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ డెంటల్ కౌన్సిల్ ఆధ్వర్యంలో 14 దంత కళాశాలల్లో వైద్యవిద్యార్థులు, సిబ్బంది మొక్కలు నాటారు.