Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వారి సేవలు వెలకట్టలేనివి-ఆర్టీసీ ఎమ్డీ వీసీ సజ్జనార్
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
ఆపత్కాలంలో వైద్యులు చేస్తున్న సేవలు వెలకట్టలేనివని టీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ అన్నారు. శుక్రవారం తార్నాకలోని ఆర్టీసీ ఆస్పత్రిలో జరిగిన డాక్టర్స్ డే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైద్యం అందించేందుకు డాక్టర్లు అనేక త్యాగాలు చేస్తున్నారనీ, వారిని సమాజం ఎప్పుడూ గౌరవప్రదంగానే చూస్తుందని చెప్పారు. అంతకుముందు ఆయన కేక్ కట్చేసి వైద్యులకు శుభాకాంక్షలు తెలిపారు. వైద్యులు మానవత్వాన్ని తమ భుజస్కందాలపై మోస్తూ, జీవితాలను అంకితం చేస్తున్నారని ప్రసంసించారు. ఆర్టీసీలో సిబ్బంది, ఉద్యోగుల ఆరోగ్య సంక్షేమంపై సంస్థ ప్రత్యేక దష్టి సారించిందన్నారు. దీనిలో వైద్యులదే కీలకపాత్ర అని చెప్పారు. కార్యక్రమంలో తార్నాక ఆస్పత్రి ఓఎస్డీ డాక్టర్ వీఎస్ రెడ్డి, చీఫ్ పర్సనల్ మేనేజర్ యుగంధర్, సూపరింటెండెంట్, చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఎన్ శైలజామూర్తి, మెడికల్ అడ్మినిస్ట్రేటర్ డాక్టర్ పీ శ్రీనివాస్, పర్సనల్ ఆఫీసర్ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.