Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
ప్రముఖ జర్నలిస్టు, సామాజిక ఉద్యమకారిణి తీస్తా సెతల్వాద్, సీనియర్ జర్నలిస్ట్, ఆల్ట్ న్యూస్ సహ వ్యవస్థాపకుడు మహమ్మద్ జుబేర్ అక్రమ అరెస్ట్‌లను ఖండిస్తున్నట్టు తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన ్(టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర అధ్యక్షులు ఎం. సోమయ్య, ప్రధాన కార్యదర్శి బి. బసవపున్నయ్య, ఐఎఫ్‌డబ్ల్యూజే జాతీయ కార్యదర్శి పి.ఆనందం తెలిపారు. వారిని జైలులో పెట్టడాన్ని తప్పుబట్టారు. తీస్తా సెతల్వాద్‌ను గుజరాత్ తీవ్రవాద నిరోధక బృందం(ఏటీఎస్) పోలీసులు అరెస్ట్ చేయడం ఎంతమాత్రం సరికాదని వ్యాఖ్యానించారు. సోషల్‌మీడియా పోస్టులు సరిగ్గా లేవంటూ జర్నలిస్ట్ జుబేర్‌ను అదుపులోకి తీసుకోవడం మంచి పరిణామం కాదని చెప్పారు. ప్రజాస్వామ్య దేశంలో వాక్ స్వాతంత్య్రాన్ని వినియోగించుకోవడం కూడా తప్పేనా? అని ప్రశ్నించారు. వెంటనే సంబంధిత జర్నలిస్టులను బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు.