Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆర్టీసీ బస్సెక్కండి
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
తిరుమల వెంకటేశ్వరస్వామి దర్శనం కోసం యాత్రీకులు పడే పాట్లు అన్నీ ఇన్నీ కావు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ఈ తిప్పలకు ఫుల్స్టాప్ పెట్టింది. మీమీ ప్రాంతాల నుంచి టీఎస్ఆర్టీసీ బస్సులో తిరుమలకు వెళ్తే, దర్శనం టిక్కెట్ కూడా ఆర్టీసీ వారే ఇచ్చేస్తారు. రోజుకు వెయ్యి దర్శనం టిక్కెట్ల కోటాను తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) టీఎస్ఆర్టీసీకి ఇచ్చింది. ఒక్కో ప్రత్యేక దర్శనం టిక్కెట్ ఖరీదు రూ.300. (బస్సు చార్జీ అదనం) ఈ విధానం ఈనెల 1నుంచి అమల్లోకి వచ్చినట్టు టీఎస్ఆర్టీసీ చైర్మెన్ బాజిరెడ్డి గోవర్థన్ తెలిపారు. ఈ విషయాన్ని టీఎస్ఆర్టీసీ రీజియన్, డిపో మేనేజర్లు ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. టీఎస్ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తూ, రూ.300 శీఘ్ర దర్శన టిక్కెట్లు తీసుకుంటే తిరుపతి నుంచి తిరుమలకు అక్కడి స్థానిక బస్సులో తీసుకెళ్లి ఉదయం 10 గంటలకు శీఘ్ర దర్శనం కల్పిస్తారని ఆయన వివరించారు. వారం రోజుల ముందు టీఎస్ఆర్టీసీ వెబ్సైట్ లేదా అధీకత డీలర్ ద్వారా బస్ టిక్కెట్‌తో పాటు దర్శనం టిక్కెట్‌ను బుక్ చేసుకోవాలని తెలిపారు.