Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ఢిల్లీలోని ఆయుష్ విభాగంలో రెసిడెంట్ మెడికల్ సూపరింటెండెంట్‌గా ఎనలేని సేవలనందించింనందుకు గానూ తెలుగు డాక్టర్ ఆనంద్ ఇస్లావత్కు ఉత్తమ డాక్టర్ ప్రశంసా పత్రం దక్కింది. శుక్రవారం వైద్యుల దినోత్సవం సందర్భంగా డిప్యూటీ కమిషనర్ శశాంక చేతుల మీదుగా ఆనంద్ ఢిల్లీలో ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. ముఖ్యంగా, కోవిడ్ నివారణ చర్యలు, ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరాల ద్వారా ఎంతో మందిని ఆదుకున్నందుకు గాను ఆనంద్ ఇస్లావత్కు ఈ గుర్తింపు దక్కింది. తన సేవలను గుర్తించినందుకు డాక్టర్ ఆనంద్ అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు ఘనశ్యాం, శ్రీనివాస్, అనిల్, ఈ.సీ గోపాల్ తో పాటు పలువురు పాల్గొన్నారు.