Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నాణ్యతకు, నమ్మకానికి మారుపేరు : ఎమ్మెల్యే మైనంపల్లి
నవతెలంగాణ-సిటీబ్యూరో
కస్టమర్ల నమ్మకాన్ని సంపాదించి, దినదినాభివృద్ధి సాధిస్తున్న 'ఉషోదరు సూపర్ మార్కెట్' తన 24వ స్టోర్ శుక్రవారం హైదరాబాద్‌లోని మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు చేతుల మీదుగా బొల్లారంలో ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నాణ్యత, నమ్మకానికి మారుపేరైన ఉషోదయ సూపర్ మార్కెట్ సంస్థ మరింత అభివృద్ధి సాధించాలన్నారు. ప్రజానీకం ఈ స్టోర్‌లో కొనుగోళ్లు చేసి నాణ్యమైన వస్తువులను సొంతం చేసుకోవాలని ఆకాంక్షించారు. అనంతరం ఆ సంస్థ వ్యవస్థాపకులు, మేనేజింగ్ డైరెక్టర్ ఎం.యుగంధర్ మాట్లాడారు. బొల్లారంలో తమ సంస్థ 24వ స్టోర్‌ను ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. 2005లో హైదరాబాద్‌లోని ఏఎస్‌రావునగర్‌లో ఉషోదయ సూపర్ మార్కెట్‌ను ప్రారంభించినట్టు గుర్తు చేశారు. అనతికాలంలోనే తొలి స్టోర్ కస్టమర్ల విశ్వాసాన్ని చూరగొని, వ్యాపారం అభివృద్ధి చెందిందన్నారు. నాణ్యత, నమ్మకంతో కస్టమర్ల ఆదరణ సంపాదించగలిగామని చెప్పారు. తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్‌లో సైతం తమ స్టోర్లు ఉన్నాయని తెలిపారు. తమ స్టోర్లలో నిత్యావసర వస్తువుల నుంచి గృహోపకరణాల వరకు అన్నీ సరసమైన ధరలకే లభ్యమవుతాయని చెప్పారు. రాబోవు రోజుల్లో మరిన్ని స్టోర్లను ప్రారంభించనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో మచ్చ బొల్లారం కార్పొరేటర్ రాజ్ జితేందర్‌నాథ్, గుమ్మడి ఆనంద్ రెడ్డి పాల్గొన్నారు. స్టోర్ ప్రారంభోత్సవం మొదటి రోజు స్థానికుల నుంచి విశేష స్పందన లభించింది.