Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీజేపీ నేతలు మోడీని ఒప్పించాలి : ఎమ్మెల్యే జగ్గారెడ్డి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
అగ్నిపథ్‌ను నిరసిస్తూ సికింద్రాబాద్‌లో అరెస్టయిన నిరుద్యోగులకు బెయిల్ ఇచ్చి కేసులు ఎత్తివేయాలంటూ బీజేపీ జాతీయకార్యవర్గ సమావేశంలో ప్రధాని మోడీని ఒప్పించాలని ఎమ్మెల్యే జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ఆయన విలేకర్లతో మాట్లాడారు. అదే విధంగా అగ్నిపథ్ పథకాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై ప్రధాని స్పందించకపోతే తమ కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు. అగ్నిపథ్ ఆందోళనలు బీజేపీ పాలిత రాష్ట్రాల నుంచి మొదలయ్యాయని చెప్పారు.