Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సుప్రీం తీర్పు ప్రకారం.. 14 గేట్లు ఎత్తివేత
నవతెలంగాణ-మెండోరా
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఎగువన మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్ట్ ప్రాజెక్టు గేట్లను శుక్రవారం ఇరు రాష్ట్రాల అధికా రులు ఉదయం 8 గంటలకు తెరి చారు. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం.. బాబ్లీ ప్రాజెక్టు ఈఈ కనద్ కేడెకర్, సీడ బ్ల్యూసీ ఈఈ శ్రీనివాసరావు, ఎస్సారెస్పీ ప్రాజెక్టు ఈఈ చక్రపాణి, డిఈ మామిడి వంశీ, ఏఈఈ రవి సమక్షంలో 14 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రస్తుతం బాబ్లీ ప్రాజెక్టులో ఒక టీఎంసీ నీరు నిల్వ ఉన్నట్టు అధికారులు తెలిపారు. నీటి ప్రవాహం శనివారానికి ఎస్సారెస్పీకి చేరనున్నట్టు వెల్లడించారు.