Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆస్పత్రుల్లో సీనియర్ రెసిడెంట్ డాక్టర్ల నిరసనలు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ముందుగా ప్రకటించినట్టు గానే రాష్ట్రంలోని సీనియర్ రెసిడెంట్ డాక్టర్లు శుక్రవారం నుంచి అత్యవసర సేవలను బహిష్కరించారు. 2021 మే నెల ఉపకార వేతనం, సీనియర్ రెసిడెంట్ డాక్టర్ల పెండింగ్ వేతనాలు, సీనియర్ రెసిడెంట్ పూర్తి అయ్యేదానిపై స్పష్టత ఇవ్వాలని ప్రభుత్వాన్ని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ డిమాండ్లతో బుధ, గురువారాలు రెండు రోజుల పాటు ఓపీ, ఎలక్టివ్ ఆపరేషన్లు తదితర సేవలకు హాజరు కాకుండా నిరసనలు తెలిపారు. శుక్రవారం వాటితో పాటు ఎమర్జెన్సీ సేవలకు హాజరు కాకుండా ఆయా ఆస్పత్రుల్లో ధర్నాలు, నిరసనలు తెలిపారు. హైదరాబాద్లోని గాంధీ ఆస్పత్రిలో జిల్లాలోని సీనియర్ రెసిడెంట్ డాక్టర్లు ధర్నా చేపట్టారు. తమ మూడు డిమాండ్లు నెరవేరే వరకు వెనక్కి తగ్గేది లేదని సీనియర్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ నాయకులు డాక్టర్ రాజీవ్ తెలిపారు.
టీ-జుడా మద్ధతు
సీనియర్ రెసిడెంట్ డాక్టర్లు చేపట్టిన పోరాటానికి తెలంగాణ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ (టీ-జూడా) మద్ధతు తెలిపింది. ఈ మేరకు శుక్రవారం ఆ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు డాక్టర్ కార్తీక్, డాక్టర్ వన్యా జాస్మిన్, ఉపాధ్యక్షులు డాక్టర్ డి.శ్రీనాథ్ ఒక ప్రకటన విడుదల చేశారు. సీనియర్ రెసిడెంట్ డాక్టర్లకు ఎనిమిది నెలల పెండింగ్ వేతనాలను చెల్లించాలని డిమాండ్ చేశారు. అదే విధంగా హౌజ్ సర్జన్లు, జూనియర్ రెసిడెంట్లు, సీనియర్ రెసిడెంట్లు, సూపర్ స్పెషాలిటీ రెసిడెంట్లకు ఉపకారవేతనాలను చెల్లించడంలో జాప్యాన్ని నివారించాలని కోరారు.