Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ఈ నెల 4న హెచ్ఐసిసిలో ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండిస్టీ (ఎఫ్టి సిసిఐ) ఎక్సలెన్సీ అవార్డుల ప్ర దానోత్సవాన్ని ఏర్పాటు చేశారు. శుక్రవారం హైదరాబాద్లోని ఆ సంఘ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎఫ్టిసిసిఐ ప్రెసిడెంట్ కె భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారని తెలిపారు. వివిధ కేటగిరీల్లో 19 సంస్థలు, వ్యక్తులకు అవార్డులను అందించనున్నామన్నారు. అవార్డ్స్ కమిటీ ఛైర్మన్ గౌర శ్రీనివాస్ మాట్లాడుతూ 22 కేటగిరీల్లో అవార్డులకు దరఖాస్తులను స్వీకరించామన్నారు. తుదకు 19 కేటగిరీల్లో 150 నామినేషన్లు వచ్చాయన్నారు. ఈ సమావేశంలో వైస్ ప్రెసిడెంట్ మీలా జయదేవ్, సిఇఒ క్యాతి నారవని తదితరులు పాల్గొన్నారు.