Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పీఎఫ్ సొమ్ము కార్మికులకు ఇవ్వాలి
- ప్రభుత్వ ఆస్పత్రి ఎదుట పారిశుధ్య కార్మికుల మెరుపు ధర్నా
- సమస్యలు పరిష్కరించకుంటే నిరవధిక సమ్మెకు సిద్ధం : సీఐటీయూ
నవతెలంగాణ-కొత్తగూడెం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం ప్రభుత్వ జరనల్ ఆస్పత్రిలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులకు చెల్లించాల్సిన మూడు నెలల పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని, ఐదేంండ్లుగా వేతనాల నుండి కోత విధిస్తున్న ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) సొమ్ము ఇవ్వాలని డిమాండ్ చేస్తూ పారిశుధ్య కార్మికులు శుక్రవారం ఉదయం విధులు బహిష్కరించి మెరుపు ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా సీఐటీయూ కొత్తగూడెం పట్టణ కన్వీనర్ డి.వీరన్న మాట్లాడారు. అస్పత్రిలో పారిశుధ్య కార్మికుల వేతనాలు చెల్లించడంలో కాంట్రాక్టర్, అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు. ఆస్పత్రిలో పారిశుధ్య కార్మికుల పని ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంటుందని, వారి సేవలు వినియోగిస్తున్న కాంట్రాక్టర్ 3 నెలలుగా వేతనాలు చెల్లించకుండా కార్మికులను వేదింపులకు గురిచేయడం సరికాదన్నారు. అధికారులకు, కాంట్రాక్టర్‌కు పలు దఫాలుగా విన్నవించినప్పటికీ మెడికల్ కాలేజ్ సూపరింటెండెంట్ స్పందించడం లేదన్నారు. వెంటనే కాంట్రాక్టర్‌పై ఒత్తిడి తెచ్చి పారిశుధ్య కార్మికుల సమస్యలు తీర్చాలన్నారు. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ రెండేండ్లుగా పారిశుధ్య కార్మికులకు చేతులకు గ్లౌజులు, మాస్కులు, శానిటైజర్లు, ఇతర పరికరాలు అందజేయక పోవడం దారుణన్నారు. అనేక మంది కార్మికులు అనారోగ్యం పాలవుతున్నప్పటికీ కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తు న్నారని విమర్శించారు. వేతనాలు చెల్లించకపోతే పారిశుధ్య కార్మికులు నిరవధిక సమ్మె చేసేందుకు సిద్ధంగా ఉంటారని హెచ్చరించారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా నాయకులు భూక్యా రమేష్, జునుమాల నగేష్, అనీల్, పద్మ, హైమ, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.