Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
రాష్ట్రపతి ఎన్నికలు ఇద్దరు వ్యక్తుల మధ్య పోటీ కాదనీ, రెండు విధానాల మధ్య పోటీ అని ప్రతిపక్షాల రాష్ట్రపతి అభ్యర్ధి యశ్వంత్ సిన్హా అన్నారు. దేశ పరిరక్షణ కోసమే ఈ పోరాటమని స్పష్టంచేశారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు అధ్యక్షతన జలవిహార్లో జరిగిన సభలో ఆయన మాట్లాడారు. దేశంలోని పరిస్థితులపై కేసీఆర్ స్పష్టంగా చెప్పారని అన్నారు. సంపూర్ణ మద్దతు ఇస్తున్నందుకు టీఆర్ఎస్ పార్టీకి ధన్యవాదాలు తెలిపారు. ''చాలా రోజులుగా కేంద్ర విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నాం. దేశంలో పరిస్థితులు దిగజారుతుంటే చూస్తూ ఉండలేం'' అని అన్నారు. ఈ పోరాటం విశాల భారత పరిరక్షణ కోసం జరుగుతున్నదని చెప్పారు. విద్వేషపూరిత ప్రసంగాలు సమాజానికి మంచివి కాదన్నారు. అయితే ఒక వ్యక్తి చెబుతుంటే 135 కోట్ల మంది వినాలా.. ఇదేనా ప్రజాస్వామ్యం అని నిలదీశారు. రాష్ట్రపతి ఎన్నిక తర్వాత కూడా పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. దేశానికి కేసీఆర్ వంటి నాయకుడు అవసరమనీ, ఇప్పుడు చేస్తున్న పోరాటం భారతదేశ భవిష్యత్తు కోసం, మన పిల్లల బంగారు భవిష్యత్తు కోసం చేసేదని విశ్లేషించారు.