Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్, డిగ్రీ, గురుకుల విద్యాసంస్థల్లో పనిచేస్తున్న గెస్ట్ లెక్చరర్లు తెలంగాణ గెస్ట్ లెక్చరర్ల జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ)ని ఏర్పాటు చేసుకున్నారు. ఆ జేఏసీ అధ్యక్షుడుగా బి ప్రసాద్, ప్రధాన కార్యదర్శిగా కుంట దేవేందర్యాదవ్ ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా జైపాల్, అయిలయ్య, అనిల్, రామ్మోహన్, స్వరూప, రామలింగయ్య, కోశాధికారిగా గంగుల నరేష్, మహిళా కార్యదర్శిగా భాగ్యరేఖ, కార్యదర్శులుగా మారుతి, దేవిసింగ్, నాగరాజు ఎన్నికయ్యారు.