Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 21వ సెంచరీ ఐఏఎస్ అకాడమి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో గ్రూప్-1 కోసం సన్నద్ధమవుతున్న అభ్యర్థుల కోసం ఉచిత అవగాహన సదస్సును ఆదివారం ఉదయం 10 గంటలకు హైదరాబాద్‌లోని అశోక్‌నగర్‌లోని తమ అకాడమిలో నిర్వహించనున్నట్టు 21వ సెంచరీ ఐఏఎస్ అకాడమి చైర్మెన్ పి క్రిష్ణప్రదీప్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) అక్టోబర్ 16న నిర్వహించే గ్రూప్-1 ప్రిలిమ్స్, ఆ తర్వాత మెయిన్స్‌కు సన్నద్ధమవుతున్న అభ్యర్థుల కోసం తెలంగాణ చరిత్ర, ఉద్యమం, ఎకానమి, జాగ్రఫి వంటి అంశాలపై ప్రత్యేక అవగాహన కల్పించేందుకే ఈ సదస్సును నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ముఖ్యఅతిధులుగా తెలంగాణ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్‌కుమార్, ప్రభుత్వ సలహాదారులు కెవి రమణాచారి, తెలంగాణ నీటి వనరుల అభివృద్ధి సంస్థ చైర్మెన్ వి ప్రకాశ్, సీనియర్ ఐఏఎస్ అధికారి బిపి ఆచార్య, తెలంగాణ గ్రూప్-1 అధికారుల సంఘం అధ్యక్షులు మామిండ్ల చంద్రశేఖర్‌గౌడ్ హాజరవుతారని వివరించారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ సదస్సుకు హాజరు కావాలని కోరారు. ఇతర వివరాలకు 040 35052121, 9133237733 నెంబర్లను సంప్రదించాలని సూచించారు.