Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
సీఎంగా బాధ్యతాయుత పదవిలో ఉండి కేసీఆర్ సంస్కారహీనంగా మాట్లాడటం సరిగాదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌కుమార్ అన్నారు. శనివారం నోవాటెల్‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. రాష్ట్రపతి ఎన్నికపై బైకు ర్యాలీ తీసి ఆ హోదాను తగ్గించేలా కేసీఆర్ వ్యవహారం ఉందని విమర్శించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని విమర్శించారు. లైంగికదాడులు పెరిగిపోయాయనీ, డ్రగ్స్ కంట్రోల్ కేసులు వారం వరకు హడావిడి చేసి వదిలేస్తున్నారని ఆరోపించారు. రైతులకు బేడీలు వేసిన నీచచరిత్ర కేసీఆర్‌దని విమర్శించారు. తెలంగాణ రైతులను వదిలి.. పంజాబ్ రైతులకు ఆర్థికసాయం చేయటం అవసరమా? అని ప్రశ్నించారు. కేసీఆర్ దిగిపోయే రోజులు దగ్గర పడ్డాయనీ, టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు పక్కదారి చూస్తున్నారని బాంబు పేల్చారు. తెలంగాణకు ప్రధాని రావటంతో.. సీఎం కేసీఆర్‌కు వణుకు మెదలైందన్నారు. కేసీఆర్‌ది నిజంగా తెలంగాణ రక్తమైతే కేంద్ర ప్రభుత్వాన్ని పడగొట్టాలని సవాల్ విసిరారు.