Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీఎడ్, బీఎడ్ అభ్యర్థుల సంఘం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ఓఎంఆర్ షీట్లు వెబ్సైట్లో అందుబాటులో ఉంచాలని తెలంగాణ రాష్ట్ర డీఎడ్ బీఎడ్ అభ్యర్థుల సంఘం అధ్యక్షులు రావుల రామ్మోహన్రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గతంలో టెట్ ఫలితాలకు ఐదు రోజుల ముందు ఫైనల్ కీ ఇచ్చేవారని శనివారం ఒక ప్రకటనలో గుర్తు చేశారు. ప్రాథమిక కీలో అభ్యంతరాలకి ఫైనల్ కీలో మార్పులు చేసి ఫలితాలు ఇచ్చేవారని తెలిపారు. అభ్యర్థులకు గతంలో తుది కీ ప్రకారం మార్కులు వచ్చేవని పేర్కొన్నారు. కానీ ఈసారి వేల మంది అభ్యర్థులు ప్రధానంగా టెట్ పేపర్-1లో తుది కీకి వారికి వచ్చిన మార్కులకు పొంతన లేదని ఆందోళన వ్యక్తం చేశారు. తుది కీ ప్రకారమే ఫలితాలు విడుదలైతే తమకు మార్కులు ఎక్కువ రావాలంటూ పలువురు అభ్యర్థులు వాపోతున్నారని తెలిపారు. అనుమానాలు నివృత్తి చేసుకోవడానికి టెట్ పేపర్-1, పేపర్-2 సమాధాన పత్రాలు వెబ్సైట్లో ఉంచాలని డిమాండ్ చేశారు.