Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బాగ్ అంబర్పేట్ నియోజకవర్గ ఇన్చార్జి పద్మావతి డిపి రెడ్డి
- రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు మద్దతుగా బైక్ ర్యాలీ
నవతెలంగాణ-అంబర్పేట్
తెలంగాణ రాష్ట్రాభివృద్ధికి బీజేపీ అడుగడుగునా ఆటంకాలను సృష్టిస్తోందని బాగ్ అంబర్పేట్ నియోజకవర్గ ఇన్చార్జి పద్మావతి డిపి రెడ్డి అన్నారు. దేశంలో ప్రజాస్వామ్య సమతుల్యతను కాపాడేందుకు రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు టిఆర్ఎస్ పార్టీ పూర్తి మద్దతు ప్రకటించిన నేపథ్యంలో శనివారం ఆ పార్టీ పిలుపు మేరకు యశ్వంత్ సిన్హాకు ఘనస్వాగతం పలికేందుకు బాగ్ అంబర్ పేట్ నియోజకవర్గ ఇన్చార్జి పద్మావతి డిపి రెడ్డి ఆధ్వర్యం లో బైక్ ర్యాలీ నిర్వహించారు. అంబర్పేట్ నుంచి బేగం పేట విమానాశ్రయం చేరుకొని అటు నుంచి జలవిహార్ వరకు టిఆర్ఎస్ సీనియర్ కార్యకర్త లు, ప్రజలతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భం గా పద్మావతి డిపి రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ నాయకత్వం లో రాష్ట్రం సాధించిన ప్రగతిని చూసి ఓర్వలేకనే ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్లో పర్యటిస్తున్నా రని ఎద్దేవా చేశారు. రాష్ట్రాన్ని కేసీఆర్ ప్రగతి పథంలో నడిపించ డం, సాధించిన లక్ష్యాలను చూసి బీజేపీకి అప్పుడే వెన్నులో వణుకు మొదలైనట్టు కనిపిస్తోందని అన్నా రు. ఏదీ ఏమైనా తెలంగాణకు ఎం తో మంది నాయకులు వస్తుంటా రు.. పోతుంటారు..కానీ. కేసీఆర్ లోకల్ అని తెలిపారు.. ఈ ర్యాలీలో సీనియర్ నాయకులు పాల్గొన్నారు.