Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
కేంద్ర ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళితే.. తాము కూడా ముందస్తుకు సిద్ధమేనని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బేగంపేట విమానాశ్రయంలో ప్రధాని నరేంద్రమోదీకి స్వాగతం పలికేందుకు వచ్చిన ఆయన అక్కడ మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా ప్రధాని నరేంద్రమోడీకి స్వాగతం పలికేందుకు తాను వచ్చాననని చెప్పారు. మహారాష్ట్ర మోడల్‌గా రాష్ట్రాన్ని చేస్తామంటే కుదరదనీ, దేనికైనా తాము సిద్ధమేనని అన్నారు. మర్యాద ఇచ్చి పుచ్చుకుంటామంటూ, ఇక్కడ ఎవరూ ఎవరికీ భయపడరని బీజేపీని ఉద్దేశించి అన్నారు. టీఆర్ఎస్, బీజేపీ ఫ్లెక్సీల పంచాయతీపై స్పందిస్తూ టీఆర్ఎస్ ప్లీనరీ జరిగినప్పుడు తమకు కూడా జీహెచ్ఎంసీ జరిమానాలు విధించిందని గుర్తుచేశారు. బీజేపీ కార్యాలయంలో సీఎం కేసీఆర్‌ను ఉద్దేశిస్తూ డిజిటల్ ఫ్లెక్సీ పెట్టారనీ, ఆ తర్వాతే బై బై మోడీ ఫ్లెక్సీలు పెట్టారని వివరించారు. బీజేపీ కార్యవర్గ సమావేశాల పేరుతో హైదరాబాద్‌కు టూరిస్టులు వచ్చారనీ, ఇక్కడ జరిగిన అభివద్ధిని చూసి, తెలుసుకుని వెళ్లాలని అన్నారు.