Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మోడీ యువతను మోసం చేశారు: ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎల్ మూర్తి
- జాతీయ నూతన విద్యా విధానానికి వ్యతిరేకంగా ఓయూలో నిరసన
నవతెలంగాణ-ఓయూ
దేశంలో ఎనిమిదేండ్ల బీజేపీ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ యూనివర్సిటీల్లో చదువుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులను పరిశోధనకు దూరం చేసిందని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు ఆర్.ఎల్.మూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. సంవత్సరానికి రెండు కోట్లు ఇస్తామని చెప్పిన ప్రధాని నరేంద్ర మోడీ యువతను మోసం చేశారని, నేటి వరకు ఒక్క జాబ్ ఇవ్వలేదని విమర్శించారు. కేంద్రం తీసుకొచ్చిన జాతీయ నూతన విద్యా విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. నూతన విద్యా విధానానికి వ్యతిరేకంగా శనివారం ఎస్ఎఫ్ఐ ఓయూ కమిటీ ఆధ్వర్యంలో ఆర్ట్స్ కళాశాల ఎదుట ప్లకార్డులు ప్రదర్శించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆర్ఎల్ మూర్తి మాట్లాడుతూ.. యూజీసీ నెట్, ఆర్జెఎన్ఎఫ్, సీఎస్ఐఆర్, ఐసీఎస్ఎస్ఆర్ ఫెలోషిప్లలో కోత విధించడం ద్వారా పరిశోధన విద్యార్థులకు ఆర్థిక పరిపుష్టి లేకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ యూని వర్సిటీలను నిర్వర్యం చేస్తూ మరోపక్క బడా కార్పొరేట్ వ్యక్తుల ప్రయివేటు యూనివర్సిటీలకు అనుమతిస్తూ.. ఉన్నత విద్యను వ్యాపారంగా మార్చిందన్నారు. ఎస్ఎఫ్ఐ ఓయూ కమిటీ అధ్యక్ష కార్యదర్శులు ఆంజ నేయులు, రవి నాయక్ మాట్లాడుతూ... బడా పెట్టుబడిదారులకు కొమ్ము కాస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఉన్నత విద్యారంగాన్ని నిర్వీర్యం చేసి కాషాయీకరణ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ విజయ నాయక్, ఉపాధ్యక్షులు మమత, రామాటేంకి శ్రీను, సహాయ కార్యదర్శులు ఆనంద్ శర్మ, రమ్య, పవన్, కృష్ణ నాయక్, విద్యార్థులు కందిమల్ల రవి, రాజు, రాజేష్, సందీప్, వనుష, సతీష్, నగేష్, అనిల్, రాజేశ్, శ్రీకాంత్ పాల్గొన్నారు.