Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పాసు లేదని యాదమ్మను అడ్డుకున్న భద్రతాసిబ్బంది
- రోడ్డుపైనే కూర్చొని నిరసన
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి వంట చేసేందుకు వచ్చిన కరీంనగర్‌కు చెందిన వంటలక్క యాదమ్మకు ఘోరఅవమానం జరిగింది. నోవాటెల్‌లోకి వెళ్లేందుకు పాసు లేదనే కారణంతో భద్రతా బలగాలు రోడ్డుపైనే అమెను అడ్డుకున్నాయి. మరోవైపు తనను తీసుకొచ్చిన కారు కూడా అక్కడ లేకపోవడంతో ఎక్కడపోవాలో అర్థం కాక రోడ్డుపైనే కూర్చొని తన నిరసన తెలిపింది. కరీంనగర్‌కు చెందిన యాదమ్మ వంటలు చేయడంలో చేయితిరిగిన వ్యక్తి. వేలాది మందికైనా తాను చేసిన రుచికరమైన వంటకాలతో ఆహా ఏమి రుచి అనిపించుకుంటుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజరు ఆమెను పిలిపించి ప్రధాని మోడీకి తెలంగాణ వంటకాల రుచి చూపించాలని కోరారు. దీంతో దానికి ఆమె ఒప్పుకున్నది. కరీంనగర్ నుంచి ఆమెను కారులో శనివారం నోవాటెల్‌కు రప్పించారు. తీరా లోనికెళ్లే సమయంలో పాస్ లేదని చెప్పి భద్రతాసిబ్బంది అడ్డుకున్నారు. అక్కడ ఏం జరుగుతుందో అని తెలుసుకునేలోపే ఆమెను తీసుకొచ్చిన కారు వెళ్లిపోయింది. దీంతో ఎక్కడకు వెళ్లాలో తెలియక ఆమె రోడ్డుపైనే కూర్చొని తన నిరసన తెలిపింది.