Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విఎస్ బోస్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
క్రూరమైన ప్రజావ్యతరేక విధానాలకు పాల్పడుతున్న హిట్లర్ ఆరాధకుడు ఫాసిస్టు ప్రధాని నరేంద్ర మోడీకి రాష్ట్రంలో అడుగు పెట్టే హక్కు లేదని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.ఎస్.బోస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని ప్రజల ఆస్తులైన ఆదిలాబాద్ సిమెంట్ కార్పొరేషన్ అఫ్ ఇండియా, సింగరేణి నాలుగు బొగ్గు గనుల అమ్మకానికి పెట్టి, స్టేట్ బ్యాంకు అఫ్ హైదరాబాద్‌ను నిర్వీర్యం చేసి, ప్రజల ఆకాంక్షాలైన ఖాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం స్టీల్ ప్లాంట్, పసుపు బోర్డు వంటి సంస్థలు స్థాపించకుండా మోసం చేస్తున్న మోడీ హైదరాబాద్‌కు రావడం సిగ్గుచేటన్నారు. కార్మిక, ప్రజా వ్యతరేక విధానాలకు పాల్పడుతున్న ప్రధాని మోడీ రాకను నిరసిస్తూ హైదరాబాద్‌లోని హిమా యత్ నగర్ రహదారిలో శనివారం ఏఐటీయూసీ హైదరాబాద్ జిల్లా సమితి ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించారు. 'మోడీ గో బ్యాక్', 'మోడీకి స్వాగతం లేదు' 'కార్పొరేట్ అనుకూల-ప్రజా వ్యతరేక ప్రధాని మాకొద్దు', 'మోడీ కాపలాదారుడు కాదు దోపిడీ దారుడు'అని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బోస్ మాట్లాడుతూ దేశంలో నిరుద్యో గం, పేదరికం, అసమానతలు పెరుగుతున్నా యని చెప్పారు. దేశ సంపద అయిన ప్రభుత్వరంగ సంస్థల ను, జాతీయ బ్యాంకులను తెగనమ్ముకుంటూ వ్యవసీ ్థకృత దోపిడీకి ప్రధాని పాల్పడుతున్నారని విమర్శిం చారు. కార్పొరేట్లు చేసే దోపిడీని సైతం చట్టబద్ధం చేస్తున్నారని అన్నారు. జాతీయ బ్యాంకులను నిండా ముంచుతున్న బడా పారిశ్రామికవేత్తలను రిజర్వు బ్యాంకు అఫ్ ఇండియా బోర్డులో సభ్యులుగా ఎలా నియమిస్తారని ప్రశ్నించారు. వారిని తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ హైదరా బాద్ జిల్లా అధ్యక్షులు కమతం యాదగిరి, ప్రధాన కార్యదర్శి ఎం నరసింహ, కోశాధికారి బొడ్డుపల్లి కిషన్, కార్యదర్శులు ఆర్ మల్లేష్, లక్ష్మీ నాయకులు సబ్బు రాజమౌళి, రమేష్ ఉమర్ ఖాన్, జంగయ్య, జ్యోతి, శ్రీమాన్ తదితరులు పాల్గొన్నారు.