Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పుస్తకాల విక్రయ కేంద్రం
- విద్యార్థులకు అందుబాటులో పాఠ్యపుస్తకాలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్ర ప్రభుత్వ పాఠ్యపుస్తక ముద్రణాలయ ఆవరణలో ఆదివారం పుస్తక విక్రయ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ నేపధ్యంలో రాష్ట్రంలోని విద్యార్థిని విద్యార్థులందరికీ అన్ని తరగతుల పాఠ్యపుస్తకాలు ఒకే దగ్గర దొరకనున్నాయి. ప్రభుత్వ ధరల ప్రకారం అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఈ విక్రయ కేంద్రం ఏర్పాటు చేశారు. డైరెక్టర్ ఎస్. శ్రీనివాస చారి ఈ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమములో అధికారులు టి నరేష్కుమార్, ఎ.శ్రీనివాస్, వి.సంతోష్‌కుమార్, కె విజరు కుమార్, ఎస్ శివానంద్, పి ప్రవీణ్ కుమార్, బుక్ స్టాల్ చైర్మెన్ కె శ్రీకాంత్, యం.నరహరి వైస్ చైర్మెన్,ఎస్.సందీప్ కుమార్ తరులు పాల్గొన్నారు.