Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
బీజేపీ పాలిత రాష్ట్రాల కన్నా టీఆర్ఎస్ పాలిస్తున్న తెలంగాణ బాగుందని ఎమ్మెల్యే కె.పి.వివేకానంద తెలిపారు. ఆదివారం హైదరాబాద్లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. కేంద్ర మంత్రి అనురాగ్ ఠాగూర్ తండ్రి హిమాచల్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కాదా? అనురాగ్ వారసత్వ రాజకీయాలకు ప్రతినిధి అని విమర్శించారు. కేసీఆర్ కష్టపడి పైకి వచ్చిన నేత అన్నారు. పీయూసీ చైర్మెన్ ఏ.జీవన్ రెడ్డి మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్రమోడీకి దమ్ముంటే సీఎం కేసీఆర్ లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని సవాల్ చేశారు.