Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ప్రధానమంత్రి నరేంద్రమోడీ, కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు ఇతర అగ్రనేతలు యాదమ్మ చేతి వంటకాలను ఆదివారం రుచిచూశారు. భోజనంతోపాటు స్నాక్స్నూ తెలంగాణ వంటకాలనే అందించారు. దాదాపు 50 రకాల వంటకాలను చేసిపెట్టారు. చిక్కుడుకాయ టమోటా, ఆలు కూర్మ, వంకాయ మసాల, దొండకాయ పచ్చికొబ్బరి తురుము ఫ్రై, బెండకాయ కాజు పల్లీల ఫ్రై, తోటకూర టమోటా ఫ్రై, బీరకాయ మిల్ మేకర్ చూర ఫ్రై, మెంతికూర పెసరపప్పు ఫ్రై, గంగవాయిలకూర మామిడికాయ పప్పు, సాంబారు, ముద్దపప్పు, పచ్చిపులుసు, బగార, పులిహౌర, పుదీన రైస్, వైట్ రైస్, పెరుగన్నం, గోంగూరు పచ్చిడి, దోసకాయ ఆవ చట్నీ, టమోటా చట్నీ, సొరకాయ చట్నీ, బెల్లన్నం, సేమియా పాయసం, భక్షాలు, బూరెలు, అరిసెలు చేసిపెట్టారు. పెసరపప్పు గారెలు, సకినాలు, మక్క గుడాలు, సర్వపిండి, తదితరాలను అందించారు. యాదమ్మతో పాటు ఆమె టీం సభ్యులు వంటకాలు చేసిపెట్టారు.