Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రేషన్ కార్డులు, ఆసరా పింఛన్లు ఎప్పుడు?
- ఐద్వా ఆధ్వర్యంలో నేడు ఇందిరా పార్కు వద్ద ధర్నా
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
డబుల్ బెడ్ రూం ఇండ్లు, ఆసరా పింఛన్లు, రేషన్ కార్డులతో పాటు మహిళలు ఎదుర్కొంటున్న ఇతర సమస్యలను ఎప్పుడు పరిష్కరిస్తారో చెప్పాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం(ఐద్వా) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆర్. అరుణజ్యోతి, మల్లు లక్ష్మి, ఆదివారం ఒక ప్రకటన లో ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఉపాధి, అభయ హస్తం నిధులతో పాటు స్థానిక సమస్యల పరిష్కారం కోసం నేడు ఇందిరా పార్కు వద్ద ధర్నా నిర్వహి స్తున్నట్టు తెలిపారు.రాష్ట్ర వ్యాప్తంగా రెండు నెల్లుగా ఐద్వా నిర్వహించిన సర్వేలో మహిళలు ఎదుర్కొంటున్న పలు సమస్యలు వెలుగులోకి వచ్చాయని పేర్కొన్నారు. రోడ్లు, డ్రైనేజి, మంచినీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నా రని తెలిపారు. సమస్యల పరిష్కారించాలని ఇప్పటికే మండల, జిల్లా స్థాయిలో ధర్నాలు చేశామనీ, సంబంధిత అధికారులకు వినతి పత్రాలు అందజేశామని పేర్కొన్నారు.